దువ్వాడ తెలివితేటలు మాములివి కాదయా!?

తమ పార్టీ నాయకులు హత్యలు, డోర్. డెలివరీలు వంటి ఎన్ని ఘోరమైన తప్పులు చేసినా సరే పెద్దగా పట్టించుకోకుండా.. ఉపేక్షిస్తూ ఉండే అలవాటు జగన్మోహన్ రెడ్డి ది. అలాంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహించేంత తప్పు చేసిన నాయకుడు దువ్వాడ శ్రీనివాస్. టెక్కలి నియోజక వర్గానికి చెందిన ఈ వైసిపి నేత వివాహేతర సంబంధం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ రచ్చ అయింది. తాజాగా భార్యను బద్నాం చేయడానికి ఆయన చేసిన మరో హేయమైన ప్రయత్నం కూడా వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ చావు తెలివితేటలు ఏ రేంజిలో ఉంటాయో తెలిసి జనం అసహ్యించుకుంటున్నారు.

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం కలిగివున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా దువ్వాడ భార్య వాణి, కూతురు వెళ్లి గొడవ చేసినా సంగతి తెలిసిందే. ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. అంతా పరస్పరం కేసులు పెట్టుకున్నారు. తర్వాత దివ్వెల మాధురి కారులో వెళుతూ టోల్ గేటు వద్ద మరొక వాహనాన్ని ఢీకొని గాయపడడం జరిగింది. దువ్వాడ భార్య తనను వేధిస్తున్నందు వల్లనే కారు తీసుకుని ఆత్మహత్య చేసుకోడానికి వచ్చినట్టు ఆమె అప్పుడు చెప్పారు. అయితే ఆ మాటలు దువ్వాడ స్కెచ్, స్క్రిప్ట్ ప్రకారం చెప్పినవి అని ఇప్పుడు తేలుతోంది.

మాధురి గాయపడి అంబులెన్స్ లో వెళుతున్న సమయంలో ఆమెకు ఫోన్ చేసి మాట్లాడిన దువ్వాడ.. వాణి వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టుగా మీడియా కు చెప్పాలని గైడెన్స్ అందించాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే మాధురి చెప్పింది. తీరా ఇప్పుడు, ఆమె అంబులెన్స్ లో వెళుతున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియో వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియో తో దువ్వాడ కుట్ర, తెలివితేటలు వెలుగులోకి వచ్చాయి. సొంత భార్యను బద్నాం చేయడానికి ఇన్ని కుట్రలా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories