దువ్వాడ ప్రియురాలి ఓవరాక్షన్‌పై కేసు!

వారిద్దరూ అనైతిక శృంగార బంధంలో ఉన్నవారు. సూటిగా చెప్పాలంటే ఇలాంటి అనైతిక బంధాలను కొనసాగించేవారు మనకు సమాజంలో లెక్కకు మిక్కిలిగా కనిపిస్తారు. కానీ వారిద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సెలబ్రిటీ రాజకీయ నాయకులు. ఆయనేమో ఏకంగా చట్టస ప్రతినిధి కూడా! ఆమె.. తనకు రాజకీయంగా బంగార భవిష్యత్తు ఉంటుందని కలంటున్న నాయకురాలు. కానీ ఇక్కడ దారుణమైన ట్విస్టు ఏంటంటే.. వారిద్దరూ.. తమ అనైతిక శృంగార బంధాన్నే  ఒక మార్కెటింగ్ ఎలిమెంట్ గా వాడుకుంటూ.. తమకు పాపులారిటీ సంపాదించుకోవాలని ఆరాటపడుతూ ఉండడం. వారిద్దరూ మరెవ్వరో కాదు.. టెక్కలికి చెందిన వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరియు ఆయన ప్రియురాలు దివ్వల మాధురి. తమ పాపులారిటీ కోసం చేసే రీల్స్ లో తిరుమల దేవదేవుడిని కూడా వాడుకున్నందుకు ఇప్పుడు ఆమెపై కేసు నమోదు అయింది.

దువ్వాడ శ్రీనివాస్- దివ్వల మాధురి గురించి తెలుగునాట ప్రతి ఒక్కరికీ తెలిసిన సంగతే. భార్య వాణితో విభేదించి విడాకులకు కోర్టుకు వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్, భర్తతో విడాకులకు అప్లయి చేసుకున్న ఉన్న దివ్వల మాధురి ఇద్దరూ శృంగార బంధంలో గడుపుతున్నారు. తామిద్దరూ లివింగ్ టుగెదర్ రిలేషన్ షిప్ లో ఉన్నామని, అందులో తప్పేముందని ప్రశ్నిస్తూ.. సంచలనంగా నలుగురి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు మాధురి.
ఈ ప్రేయస ప్రియులు ఇటీవల తిరుమల వెళ్లి, దంపతుల లాగానే ఆశీర్వచనాలు కూడా చేయించుకుని అక్కడ మీడియాకు తమ ముచ్చట్లు చెప్పుకున్నారు. ఇద్దరికీ డైవోర్స్ వచ్చాక పెళ్లి చేసుకుంటాం అన్నారు. అప్పటిదాకా కలిసే ఉంటాం అని కూడా అన్నారు. అక్కడితో ఆగితే ఒక రకంగా ఉండేది. దివ్వల మాధురి ఆలయం ఎదుట ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసుకోవడం కోసం రీల్స్ చేశారు. శ్రీవారి ఆలయం ఎదురు, పుష్కరిణి తదితర చోట్ల, భక్తులు ఆధ్యాత్మిక ప్రాశస్త్యం గల ప్రాంతాలుగా భావించేచోట్ల రీల్స్ చేయడం, తమ సహజీవనం ఘనకార్యం అయినట్టుగా దేవుడి గుడి వద్ద నిల్చుని చెప్పడం ద్వారా.. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాధురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇలాంటి రీల్స్ లేదా వివాదాలు లేదా సంచలన వ్యాఖ్యల ద్వారానే పాపులర్ కావాలనేది తొలినుంచి దివ్వల మాధురి తీరుగా కనిపిస్తోంది. వీరిద్దరి అనైతిక సహజీవన బంధం వెలుగులోకి వచ్చినప్పుడు.. ‘అవున్నిజమే అయితే తప్పేంటి’ అంటూ టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. మరొకరు పడకింటి వ్యవహారాలు మార్కెట్ చేసుకోవడానికి టీవీ చానెల్లు కూడా ఎగబడుతుంటాయి గనుక.. ఈమె కోపరేషన్ వారికి లడ్డూలా దొరికింది. ఈ ఇద్దరు ప్రేయసీ ప్రియులను కలిపి చానెల్ స్టుడియోల్లో కూర్చోబెట్టి సుదీర్ఘ ఇంటర్వ్యూలు చేసి..  వారి బంధానికి విశ్వవ్యాప్త ఆదరణ కల్పించే ప్రయత్నం కూడా చేశారు. టోల్ గేటు వద్ద కారుతో యాక్సిడెంట్ చేసి.. దువ్వాడ భార్యపై నింద వేయడానికి, ఆత్మహత్య చేసుకోవడానికే అలా యాక్సిడెంట్ చేశానని మాధురి చెప్పిన వైనం అందరికీ గుర్తుంటుంది. అలా ఆత్మహత్య అనే సాకు చెప్పాలని, దువ్వాడ శ్రీనివాస్ ఫోనులో సూచించినట్టుగా తర్వాత ఆడియో వెలుగులోకి వచ్చింది. అలా వారి బండారం బట్టబయలైంది. ఇప్పుడు తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్లి అక్కడినుంచి వేసిన రీల్స్ రూపంలో వేసిన వెర్రి మొర్రి వేషాలు మరో వివాదం అయ్యాయి. ఆలయ సంస్కృతికి ఇది మచ్చ అనే విమర్శలు వస్తున్నాయి. ఈ కేసును ఈ ప్రేమికులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories