దుల్కర్ కొత్త సినిమా మొదలైందోచ్! మళయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ కి తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ఇక్కడ మంచి పేరుతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే మరో డైరెక్ట్ తెలుగు సినిమా “ఆకాశంలో ఒక తార”లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని డైరెక్షన్ లో ఈ సినిమా రానుంది. అయితే , తాజా అప్ డేట్ ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో దుల్కర్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మిగిలిన నటీనటుల గురించి త్వరలోనే ప్రకటించబోతున్నారు. లైట్ బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్ మరియు గీతా ఆర్ట్స్ కలయికలో ఈ సినిమా రాబోతుంది.