ప్రపంచం మొత్తం తలతిప్పి చూసేవిధంగా అద్భుతమైన రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివస్తే గనుక.. దానిని ఎవరు పూర్తిచేసినా సరే.. దానికి సంబంధించిన కీర్తి మొత్తం నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందనే అసూయ! చంద్రబాబునాయుడు యొక్క అద్భుతమైన దార్శనికత, సృజనాత్మక దృక్పథం, అద్భుత ఐకానిక్ నిర్మాణాలు అమరావతికి వన్నెతెచ్చేలా ఉండాలనే ఆవావహ దృక్పథం కారణంగా.. కొన్ని ప్రభుత్వ భవనాల డిజైన్లు రూపొందాయి. వాటికి సంబంధించి పనులు కూడా మొదలయ్యాయి. వాటిని ఎవరు పూర్తిచేసినా సరే.. అమరావతి నగరానికి రూపశిల్పిగా చరిత్రలో శాశ్వతమైన స్థానం చంద్రబాబుదే అవుతుంది. ఈ విషయాన్ని ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి అమరావతిపై కుట్ర చేశారు. అయిదేళ్లు పాటు ఆ ప్రాంతాన్ని స్మశానంలాగా మార్చేశారు. అమరావతి రాజధాని అనేది కేవలం ఒక కులానికి మేలు చేకూర్చడానికి ఉద్దేశించినది అనే అసహ్యకరమైన ప్రచారంతో జగన్ తన పరువు తానే తీసుకున్నారు. అయిదేళ్లక జగన్ దుర్మార్గమైన పాలన ముగిసేసరికి అమరావతి మొత్తం పిచ్చిమొక్కలతో అడవిలాగా తయారైంది. ఎక్కడ ఏ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో.. ఏవి పనులు కొనసాగించడానికి పనికొస్తాయో, ఏవి పనికిరావో, తేల్చుకోలేని డోలాయమాన పరిస్థితిలోకి నెట్టారు.
జగన్ పాలన అంతరించి.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఐఐటీ కళాశాలలకు చెందిన నిపుణులను పిలిపించి సగంలో ఆగిన నిర్మాణాల పటిష్టతను పరిశీలింపజేసింది. జగన్ సర్కారు ఏర్పడే నాటికే పూర్తయి ఉన్న పునాదులన్నీ నీటిమడుగుల్లో మునిగిపోయి ఉన్నాయి. వాటిని నాణ్యతను, భద్రతను పరిశీలించిన నిపుణులు మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పట్లో తయారుచేసిన డిజైన్ల ప్రకారమే సచిలాయం, హైకోర్టు, శాసనసభ భవనాలను నిర్మించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో వీటి మొత్తం అంచనా వ్యయం సుమారు 12 వేల కోట్లు! ఇప్పుడు వ్యయం పెరగవచ్చు గానీ.. నిర్మాణం అదే డిజైన్ల ప్రకారం జరగబోతున్నది. జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద చేసిన సమస్తమైన కుట్రలు ఇప్పుడు దూదిపింజెల్లాగా పటాపంచలు అయిపోతున్నాయి.
2014లో విభజన తర్వాత తొలిసారిగా ఏపీ పాలన పగ్గాలు చేతబట్టినప్పుడు.. ఏపీ ప్ రజలు తలెత్తుకునేలా చేసే గర్వించదగ్గ రాజధానిని అందిస్తానని చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే దానికి సంబంధించిన సుదీర్ఘ కసరత్తులు చేశారు. దాదాపు యాభై వేల ఎకరాలను లాండ్ పూలింగ్ ద్వారా సేకరించి.. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అమరావతి ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. లండన్ కు చెందిన ప్రఖ్యాత నార్మన్ అండ్ ఫోస్టర్ సంస్థతో డిజైన్లు తయారుచేయించారు. నిజానికి అమరావతి రాజధాని ఎలా ఉండాలనే స్వప్నం కేవలం చంద్రబాబుదు మాత్రమే కాదు. ఆయన కలలను తెలుగు ప్రజలు అందరూ పంచుకున్నారు. అందరూ అలాంటి అద్భుతం ఆవిష్కృతం అవుతుందని ఎదురుచూశారు. తీరా జగన్ ప్రజల ఆశలు చిదిమేశారు. ఇప్పుడు జగన్ దిగిపోయాక.. మళ్లీ అవే పాత డిజైన్లతోనే.. ఇంటీరియర్ మాత్రం చిన్న మార్పులు చేసేలా మళ్లీ నార్మన్ అండ్ ఫోస్టర్ నే రంగంలోకి తీసుకువచ్చి పనులు పూర్తిచేయబోతున్నారు.. చంద్రబాబునాయుడు!
హైకోర్టు, సచివాలయం భవనాలకు చంద్రబాబు పాలనలో 330 కోట్ల ఖర్చుతో పునాదులు వేయడం పూర్తయింది. శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన మాత్రం జరిగింది. ఈ మూడు ఐకానిక్ భవనాల నిర్మాణాలను ఇప్పుడు శరవేగంగా ముందుకు తీసుకువెళుతున్నారు. అమరావతిని నాశనం చేయాలనుకున్న జగన్ కలలన్నీ దెబ్బతిన్నట్టేనని ప్రజలు అనుకుంటున్నారు.