లేటెస్ట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ ఫీమేల్ లీడ్ లో నటించిన చిత్రం “డ్రాగన్” కూడా ఒకటి. తెలుగులో “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లు అందుకుంది.
అయితే ఈ చిత్రం సక్సెస్ ని మేకర్స్ ఎంజాయ్ చేస్తుండగా లేటెస్ట్ గా ప్రదీప్ రంగనాథన్ ఒక పవర్ఫుల్ ఫోటో మూమెంట్ ని షేర్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ని తాను కలిసినట్టుగా ఇద్దరి కలిసి హ్యాపీ మూమెంట్స్ లో ఉన్న ఫొటోస్ షేర్ చేసుకున్నాడు. అలాగే ఇందులో తలైవర్ ఎప్పుడైతే ఆ సిగరెట్ కాల్చే స్టైల్ చేసారో అప్పుడే నేను కూడా అయ్యిపోయాను అంటూ లైన్ కూడా పెట్టాడు. దీనితో ఈ పిక్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం రజినీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.