మెగాస్టార్ వారసుడిగా సినీ రంగం ప్రవేశం చేసినప్పటికీ తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నాడు రామ్ చరణ్. రెండో సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. ఆ తరువాత వరుస హిట్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజాగా రామ్ చరణ్ తేజ్ కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. అదేమిటంటే ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబోతున్నారని సమాచారం. సినీ పరిశ్రమకు రామ్ చరణ్ తేజ అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు గౌరవ డాక్టరేట్ అందచేయనున్నారు. ఈ నెల 13వ తేదీన చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం వేడుక జరగనుంది, ఈ వేడుకలు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నిర్మాత ఈసరి గణేష్ ఆధ్వర్యంలో జరగనున్నాయి.
ఈ వేడుకలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను అందజేయనున్నారు.