పుష్ప 2 తో సై అంటున్న డబుల్‌ ఇస్మార్ట్‌!

ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అదే డేట్ కోసం కొన్ని సినిమాలు ఏకంగా టవల్స్‌ పరిచేస్తున్నాయి. ఇప్పటికే ఆగస్టు 29న  డేట్ సెట్ చేసుకున్న నాని సరిపోదా శనివారం ఆగస్టు 15 డేట్ మీద కన్నేయగా ఇపుడు డబుల్ ఇస్మార్ట్ కూడా అదే డేట్ మీద కన్నేసింది.

అంతేకాదు ఆరోజు బరిలోకి దిగుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది కూడా. ఉస్తాద్ రామ్ పోతినేని, సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ తమ భారీ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు. దాని ప్రకారం డబుల్ ISMART ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

ఇక సినిమా విడుదలకు స్వాతంత్య్ర దినోత్సవం సరైన సమయం అని అందరికీ తెలుసు. గురువారం సెలవు కాగా, సోమవారం (రక్షాబంధన్) మరో సెలవుదినాన్ని కూడా సినిమా క్యాష్ చేసుకునేందుకు రెడీ అయింది. ఇక పవర్ ఫుల్ విడుదల తేదీ పోస్టర్‌లో రామ్ పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. విభూతి ధరించి కాస్త గంభీరంగా కనిపించాడు.  

Related Posts

Comments

spot_img

Recent Stories