ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమాల్లో ఒకటి ది రాజా సాబ్. ఈ సినిమాను డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు. ఇది హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న సినిమా. చాలా కాలం కిందటే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. కానీ వివిధ కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.
ఇంకా టీజర్ కూడా రాకపోవడంతో అభిమానులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ నుంచి రెండు బిగ్ అప్డేట్స్ వచ్చాయి. ఒకటి టీజర్ రిలీజ్ టైమ్, రెండోది సినిమా రిలీజ్ డేట్. తాజాగా ప్రకటించిన ప్రకారం, ది రాజా సాబ్ టీజర్ ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటల 52 నిమిషాలకు రిలీజ్ కానుంది.
ఇక సినిమా డిసెంబర్ 5వ తేదీ నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ డబుల్ అప్డేట్తో ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగలా మారింది. తాజా పోస్టర్ కూడా ఈ క్రేజును పెంచేలా ఉంది. మొత్తంగా చూస్తే, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమా ఇప్పుడు స్పష్టత పొందింది.
ఈ ఏడాది చివర్లో ప్రభాస్ మరోసారి భారీగా అలరించబోతున్నాడు అనే అంచనాలు మొదలయ్యాయి.