చప్పట్లు కొట్టొద్దు!

పశ్చిమ బెంగాల్‌ లో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటన యావత్‌ ప్రపంచానికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌ గతంలో తన కాన్సర్ట్‌ను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆ కాన్సర్ట్‌ను శ్రేయా ఘోషల్‌ పూర్తి చేశారు. ‘ఆల్‌ హార్ట్స్‌ టూర్‌’లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు..’ అంటూ సాగే పాటను శ్రేయా ఘోషల్‌ ఉద్వేగభరింతగా ఆలపించారు.

శ్రేయా ఘోషల్‌ ఇంకా ఎమోషనల్ గా మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎదుర్కొనే బాధ, వారి ఆవేదనను ఆమె ఈ పాట రూపంలో వినిపించారు. ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టొద్దని ఆడియన్స్‌ను శ్రేయా కోరారు. శ్రేయా పాట పాడడం పూర్తయ్యాక స్టేడియం మొత్తం ‘వీ వాంట్‌ జస్టిస్‌’ నినాదాలతో మారుమోగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories