టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కి యాక్షన్ డైరెక్టర్ గా సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా లోకేశ్ కనగరాజ్ అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.
ఈ క్రమంలో లోకేశ్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ)పై పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇంతకీ, లోకేశ్ కనగరాజ్ ఏం అన్నారంటే.. ‘‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’తో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ మొదలైంది. దానిని సరైన విధంగా పూర్తి చేయాలి. ‘విక్రమ్’ని అద్భుతంగా పూర్తి చేసేందుకు ‘రోలెక్స్’ సీన్లు పెట్టాం.
ఆ పాత్రకు వచ్చిన క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ‘రోలెక్స్’పై ఒక స్టాండలోన్ మూవీ చేయాలనుకుంటున్నాం. ‘కూలీ’ పూర్తి చేసిన తర్వాత, LCUలోని హీరోలందరితో పీక్ ఎల్‌సీయూ మూవీ చేయబోతున్నాను’ అని లోకేశ్ చెప్పుకొచ్చారు. అన్నట్టు తన యూనివర్స్‌లో ‘కూలీ’ భాగం కాదని లోకేశ్ కనగరాజ్ మరో క్లారిటీ కూడా ఇచ్చారు.