‘కుక్కల’ దొరికాడు.. లెక్కలు తేలాలి!

ముంబాయి నటి కాదంబరి జత్వానీ కేసులో.. పోలీసులు ఆమె మీద నకిలీ ఫోర్జరీ పత్రాలతో అక్రమ కేసులు బనాయించి కుటుంబం సహా అరెస్టు చేసి వేధించిన వ్యవహారంలో అసలు కీలక పాత్రధారి, అసలు నిందితుడు కుక్కల విద్యాసాగర్ ఎట్టకేలకు పోలీసులు దొరికాడు. కాదంబరి జత్వానీని ఇబ్బంది పెట్లిన వార్తలు పత్రికల్లో ముమ్మరంగా రావడం మొదలైన తర్వతా 2014లో వైసీపీ తరఫున పెనమూలరు ఎమ్మెల్యేగా కూడా పోటీచేసి ఓడిపోయిన ఈ కుక్కల విద్యాసాగర్ పరారయ్యాడు. తన ఫోన్లు అన్నీ స్విచాఫ్ చేశాడు. ఇతర మార్గాల్లో తనకు ఆత్మీయులు, మిత్రులతో మాత్రం సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడు. అయితే పోలీసులు తెలివితేటలతో వ్యవహరించి.. ఉతగ్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఓ రిసార్టులో కుక్కల విద్యాసాగర్ విలాసాలలో  మునిగి తేలుతుండగా పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు.

ఆయనను అక్కడే కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంటు ద్వారా విజయవాడకు తీసుకొస్తారు. అక్కడి మేజిస్ట్రేట్ కోర్టు ముందు పెడతారు. కుక్కల విద్యాసాగర్ కాదంబరి జత్వానీతో వివాహేతర సంబంధం కొనసాగించిన నాడు.. ఇలాంటి పర్యవసానాలు ఉండవని అనుకుని ఉంటారు. ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి.. ప్లేటు ఫిరాయించారు.

అయితే ముంబాయికి చెందిన పారిశ్రామికవేత్త కు ఫేవర్ చేయడం కోసమే.. కుక్కల విద్యాసాగర్ ను తెరముందు నిలబెట్టి, ఈ వ్యవహారం మొత్తం నడిపించారు. అయితే ఫోర్జరీ పత్రాలతో కాదంబరి మీద కేసు పెట్టినందుకు కుక్కల విద్యాసాగర్ ఈవ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు రామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలు కూడా నిందితులే. కుక్కల విద్యాసాగర్ విచారణలో అసలు వాస్తవాలు చెప్పగలిగితే అతనికే సేఫ్టీ అని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెరవెనుక నుంచి ఈ కేసును నడిపించిన వైసీపీ పెద్దలు ఎవరు;? వారు ఆశించిన అంతిమ ప్రయోజనాలు ఏమిటి? కుక్కల విద్యాసాగర్ ను ఈ కేసులో ఎరవేయడానికి , బైట్ లాగా వాడడానికి కుక్కల విద్యాసాగర్ ను ఏ రకంగా వాడుకున్నరు.. ఇలాంటి వివరాలు అన్నీ విచారణలో వెలుగులోకి వస్తాయి. కుక్కల నోరు విప్పి ఉన్నవిషయం ఉన్నదున్నట్టుగా చెబితే.. వైసీపీలోని చాలా మంది పెద్దలు కటకటాల వెనక్కు వెళ్లక తప్పకపోవచ్చు. 

Related Posts

Comments

spot_img

Recent Stories