పీకలదాకా కూరుకుపోతున్న కుక్కల!

ముంబాయికి చెందిన సినీనటి కాదంబరీ జత్వాన్ని వ్యవహారంలో అనేక కొత్త మలుపులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించి ఆ తర్వాత విడిచిపెట్టిన వ్యక్తి, తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె కోరేసరికి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన కృష్ణాజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల విద్యాసాగర్ ఇప్పుడు పీకలదాకా కురుకుపోతున్నారేమో అనిపిస్తుంది. ఏ ఫోర్జరీ సంతకాల పేరుమీద సినీనటి కాదంబరి జత్వానీ మీద కుక్కల విద్యాసాగార్ కేసులు బనాయించి.. ఆమెను అరెస్టు చేయించి వేధించారో.. అదే ఫోర్జరీ కేసులు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగానే మారే ప్రమాదం కనిపిస్తోంది. ఆ ఫోర్జరీ లావాదేవీకి సంబంధించి ఆయన పేర్కొన్న వ్యక్తులు.. అసలు ఈ వివాదంత తమకు సంబంధమే లేదని.. ఆ పత్రాలతో తమకు సంబంధం లేదని అంటున్నారు. ఏతావతా.. ‘ఫోర్జరీ’ అనేది కుక్కల విద్యాసాగరే చేశారేమో అనే అనుమానం కలిగేలా వ్యవహారం మలుపు తిరుగుతోంది. అదే జరిగిఉంటే గనుక.. కుక్కల ఈ కేసులో పీకలదాకా కూరుకుపోతున్నారని పలువురు అంచనా వేస్తున్నారు.

ఇంతకూ అసలు ఏం జరిగిందంటే..

కుక్కల విద్యాసాగర్ కు నటి కాదంబరితో వివాహేతర సంబంధం వరకు అందరికీ తెలిసినదే. ఆమె పెళ్లి డిమాండు తర్వాత.. ఆమెను వదిలించుకోవడానికి కుక్కల విద్యసాగర్ జగ్గయ్యపేటలో ఐదెకరాల భూమిని కాదంబరీ జత్వానీకి రాసి ఇచ్చేశారేమో తెలియదు. అయితే.. తాను ఆమెకు విక్రయించినట్టుగా కాదంబరి ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించారని విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా సదరు ఫోర్జరీ పత్రాలతో ఆమె తన భూమిని నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు భరత్ కుమార్ లకు అమ్మజూపారని, వారినుంచి అడ్వాన్సుగా 5 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరినీ కేసులో సాక్షులుగా చేర్చారు.

వారిలోని ప్రధాన సాక్షి చిందా వీరవెంకట నాగేశ్వరరాజు కృష్ణాజిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన మాజీ సర్పంచి. ఆయన ఇప్పుడు తాజాగా కూచిపూడి పోలీసులకు విద్యాసాగర్ మీదనే సరికొత్త ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో అసలు తనకు, అల్లుడు భరత్ కుమార్ కు సంబంధమే లేదని.. తిరుమల దర్శనానికి వెళ్లడానికి సిఫారసు ఉత్తరం కోసం విద్యాసాగర్ మనుషుల వద్ద ఆధార కార్డుల జిరాక్సు ప్రతులు ఇవ్వగా.. వాటిని వాడుకుని తమకు తెలియకుండానే తమను సాక్షులుగా చేరుస్తూ నటి కాదంబరి పై కేసు పెట్టారని వారు అంటున్నారు. భూమి కొనుగోలుకు తాము ఎవ్వరికీ డబ్బు ఇవ్వలేదని కూడా అంటున్నారు. మీడియా ద్వారా తమ పేర్లు కేసులో ఉన్నట్టు తెలియడంతో ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నామని ఆయన వివరించారు.

అయితే.. నాగేశ్వరరాజు చెబుతున్నదే నిజమైతే గనుక.. అసలు ఫోర్జరీ పత్రాలు అనేవి కుక్కల విద్యాసాగరే సృష్టించినట్టుగా తెలుస్తోంది. అసలు విద్యాసాగర్ కు సంబంధం లేకుండా.. ఆయనకు ఎక్కడ ఎంత ఆస్తి ఉన్నదో కాదంబరి జత్వానీకి ఎలా తెలుస్తుందని? ఆమె ఎలా ఫోర్జరీ పత్రాలు సృష్టించగలదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

చూడబోతే.. ఆమెను వదిలించుకోవడానికి ఐదెకరాలు కాదంబరి పేరిట రాసి ఇచ్చిన కుక్కల విద్యాసాగర్.. ఆ తర్వాత వైసీపీ పెద్దలను ఆశ్రయించాక.. ఆ స్థలం తిరిగి దక్కించుకోవడానికి , ఆమె ఆ పత్రాలతో మరొకరికి అమ్మజూపినట్టుగా తన వద్దకు సిఫారసు ఉత్తరం కోసం వచ్చిన ఆధార్ కార్డుల్లోని పేర్లను కేసు లో ఇరికించారని.. ఇప్పుడు సదరు నాగేశ్వరరాజు ఫిర్యాదుతో అంతా బయటకు వచ్చిందని అంతా అనుకుంటున్నారు. విద్యాసాగర్ ఫోర్జరీ కేసులో పీకలదాకా కూరుకుపోవడం గ్యారంటీ అని కూడా అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories