బడ్జెట్ సమావేశాలకు వచ్చే దమ్ము వైసీపీకి ఉందా?

ఈనెల 22 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల కోసం కొలువు తీరనుంది. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసేసి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికే కూటమి ప్రభుత్వానికి ఇప్పటిదాకా సమయం చాలడం లేదు. ఒక్కరో రంగాన్ని అధ్యయనం చేస్తూ శ్వేతపత్రాలు విడుదల చేస్తూ, వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే కొనసాగించాలని స్తూ ఆర్డినెన్స్ తేవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరో నాలుగునెలలో ఇదేకొనసాగిస్తే.. వివిధ శాఖల ఆర్థిక పరిస్థితి తెలిసిన తర్వాత.. సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టవచ్చునని అనుకుంటున్నారు. మొత్తానికి 22నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి.

అయితే ఈలోగానే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తమ తొందరపాటును దాచుకోలేకపోతున్నారు. ఏదో ఒకటి చంద్రబాబు ప్రభుత్వం మీద నింద వేస్తే తప్ప తమకు నిద్ర పట్టదన్నట్టుగా వారి వైఖరి ఉంటోంది. అందుకే.. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నెలరోజులు గడుస్తున్నా ఇంకా బడ్జెట్ సమావేశాలు పెట్టలేదని.. ఆయన సమర్థత ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవాల్ని గమనిస్తే..
జగన్మోహన్ రెడ్డి 2019లో మే 30న సీఎం అయ్యారు. ఆ తరువాత 42 రోజులకు శాసనసభ బడ్జెట్ సమావేశాలను జులై 12న నిర్వహించారు. చంద్రబాబునాయుడు ఇప్పుడు జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జులై 22న బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. 39 రోజుల్లోనే జరుగుతున్నాయి. జగన్ కంటె సమర్థత ఉన్నట్టే కదా అని పలువురు అంటున్నారు. నిజానికి ఇంకా కేంద్రం కూడా బడ్జెట్ సమావేశాలు జరపలేదని, కానీ వైసీపీ వారికి తిట్టడానికి ఆత్రపడుతున్నారని అంటున్నారు.

నిలదీయడం బాగానే ఉన్నది గానీ.. చంద్రబాబు సర్కారు పెట్టబోయే బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు ఉన్నదా? అనేది ప్రజల సందేహం. అధినేత ఆల్రెడీ బెంగుళూరు పారిపోయాక.. పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు వస్తారా? బడ్జెట్ నేపథ్యంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని జగన్ ఎంతగా కుంగదీశారో.. సభాముఖంగా తెలుసుకోవడానికి వారు సుముఖంగానే ఉంటారా? అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. సభకు హాజరుకావడం చేతకానివాళ్లు కూడా.. సమావేశాలు పెట్టడం లేదని అడగడం చిత్రంగా ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories