విషం కక్కినందుకు సాక్షి మూల్యం చెల్లించాల్సిందేనా?

రాజకీయ వార్తల విషయంలో సాక్షి దినపత్రిక ఏం రాసినా సరే.. అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవసరమైన కోణం ఎంతో కొంత ఉంటుందని, తద్వారా పార్టీ అనుకూల అభిప్రాయాలను ప్రజల్లో తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటారని పాఠకులు అనుకుంటూ ఉంటారు. కాబట్టి రాజకీయ వార్తల విషయంలో ఎంతగా రెచ్చిపోయి రాసినా సరే.. ఆ వార్తలకు పార్టీ అభిమానులు కార్యకర్తలు మురిసిపోవాల్సిందే తప్ప.. తటస్థ పాఠకుల్లో ఉండే విశ్వసనీయత తక్కువ. అయినాసరే సాక్షి అలాంటి ప్రయత్నాలు నిరాటంకంగా చేస్తూనే ఉంటుంది. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తుందేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కుక్కల విద్యాసాగర్, కాదంబరి జత్వానీ మధ్య జరిగిన అనైతిక వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాస్త అతిగా జోక్యం చేసుకున్న వైనం అందరూ గమనిస్తున్నదే. జగన్ ప్రభుత్వంలోని పెద్దలు రంగంలోకి దిగడం వల్ల మాత్రమే.. కాదంబరి జత్వానీకి ఆ రేంజిలో వేధింపులు తయారయ్యాయి. పోలీసులు ఆమెను ఇబ్బందిపెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. వ్యవహారం మొత్తం తెరపైకి వచ్చి పోలీసుల మీదనే విచారణ జరిగే పరిస్థితి వచ్చింది.
 
మధ్యలో సాక్షి దినపత్రిక.. కుక్కల విద్యాసాగర్ తరఫున వకల్తా పుచ్చుకున్నట్టుగా వార్తలు రాస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించింది. కాదంబరీ జత్వానీ ని పచ్చి తిరుగుబోతుగా అభివర్ణిస్తూ అనేక అసభ్యకరమైన రాతలతో ఆమె కేరక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నించింది. చాలా చవకబారు భాషలో ఆమె పట్ల ప్రజల్లో దురభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించింది. అలా విషం కక్కిన తీరు ఇప్పుడు సాక్షి పత్రిక మెడకు చుట్టుకుంటోంది.

సాక్షి మీడియాకు జిత్వానీ లీగల్ నోటీసులు పంపారు. పరువు నష్టం కింద 50 కోట్లుచెల్లించాలంటూ డిమాండ్ చేశారు. తనతో పాటు తన కుటుంబసభ్యుల పరువు తీశారని అందులో ఆరోపించారు. ఒకవైపు- జిత్వానీకి పోలీసు వేధింపుల వెనుక తన హస్తం ఉన్నట్టుగా పేరు ప్రస్తావించినందుకు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఈనాడుకు పరువునష్టం నోటీసులు పంపగా.. తన మీద నీచమైన భాషలో వరుస కథనాలు పంపినందుకు కాదంబరి సాక్షికి నోటీసులు పంపారు. ఈ కేసులో సాక్షి మూల్యం చెల్లించాల్సి వస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories