జగన్.. ‘కింగ్ ఆఫ్ లిక్కర్ స్కామర్స్’ అనిపించుకుంటారా?

గుట్టుచప్పుడు కాకుండా దోచుకునే మార్గం ఉంటే ఏ ప్రభుత్వం కూడా విడిచిపెట్టదు. ప్రజల్ని కొంచెం మాయచేయగలిగితే.. పారదర్శకతను పక్కన పెట్టేసి దోచుకోవడం సింపుల్ పని అయిపోతుంది. రాష్ట్రాలు ఎడాపెడా పన్నులు విధించుకోగల అవకాశం కూడా ఉన్న వ్యవహారం కాబట్టి లిక్కరు వ్యాపారం అనేది స్కాములు చేసే ప్రభుత్వాలకు గోల్డ్ మైన్ లాంటిది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన అక్కడి సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయనకు తెలియని ఐడియాలు కూడా తనే సమకూర్చి స్కాము చేయించిన ఆరోపణలు ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత కూడా జైలులో గడిపి.. బెయిలు పొందింది. తమిళనాడులోను, కేరళలోనూ కూడా లిక్కర్ స్కాములు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. మరి ఏకకాలంలో.. దేశమంతా ఒకే తరహా స్కాములు జరుగుతూ ఉన్న సమయంలో ఏపీలో రాజ్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ప్రభుత్వం విచారణ చేయిస్తున్న కొద్దీ.. జగన్ పరిపాలన కాలంలో.. జరిగిన లిక్కర్ స్కాము విలువ 18వేల కోట్ల రూపాయలకు పైగానేనని లెక్కలు తేలుతున్నాయి. చూడబోతే.. దేశంలో ఎన్ని ప్రభుత్వాల మీద లిక్కర్ స్కాములు వెలుగు చూసినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ‘కింగ్ ఆఫ్ లిక్కర్ స్కామర్స్’ అనిపిపంచుకుంటారని జనం ఎద్దేవా చేస్తున్నారు.
అయిదేళ్లలో జగన్ సర్కారు లిక్కర్ కుంభకోణాల్లో ఏకంగా లక్ష కోట్ల రూపాయల స్వాహాకు పాల్పడినట్టుగా.. భారతీయ జనతా పార్టీ సారథిగా పురందేశ్వరి పలుమార్లు ఆరోపించారు. అయితే శ్వేతపత్రాలు సమర్పించిన సమయంలో.. చంద్రబాబునాయుడు మాత్రం మూడువేల కోట్ల రూపాయల స్వాహా జరిగినట్టుగా వెల్లడించారు. దానిని బిజెపి ఖండించి, చాలా తక్కువ చెబుతున్నట్టుగా అన్నది కూడా. ఆయనకు అప్పటికి ఉన్నది పరిమిత సమాచారం మాత్రమే. కానీ విచారణలో తేలుతున్న సంగతుల్ని బట్టి.. జగన్ కొత్త లిక్కర్ పాలసీ తెచ్చాక.. ఏకంగా 18వేల  కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టుగా తెలుస్తోంది. అందులో వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కే వెళ్లినట్టుగా వార్తలు వస్తున్నాయి.

మద్యం తయారీ సంస్థలను వైసీపీ నేతలే బెదిరింపులతో దక్కించుకున్నారు. కొన్ని చోట్ల యాజమాన్యాలు కూడా పాతవారినే ఉంచి బినామీలుగా తమ కనుసన్నల్లో వ్యాపారం నడిపించారు. అలా సొంత, తమ ముఠాకు చెందిన వారి బ్రాండ్లు మాత్రమే.. దుకాణాల్లో అందుబాటులో ఉండేలా ఇండెంట్లు పెడుతూ.. ఆమేరకు విచ్చలవిడిగా స్వాహాపర్వం నడిపించారు. కేవలం కమిషన్ల కోసం మద్యం ధరలను విపరీతంగా పెంచేసి.. అదంతా ప్రజలతో మద్యం అలవాటు మాన్పించడానికి జగనన్న చూపిస్తున్న చిత్తశుద్ధి కింద ప్రచారం చేసుకున్నారు. తమకు ఇష్టమొచ్చినట్టుగా, కమిషన్లు ఇచ్చేవారికి, తమకు నచ్చిన వారికి మాత్రమే ఇండెంటు ఆర్డర్లు పెట్టడానికి, తమకు కమిషన్లు ఇవ్వని బ్రాండ్లు అసలు దుకాణాలకే రాకుండా చేయడానికి మాత్రమే.. దుకాణాలను ప్రభుత్వం ద్వారా నిర్వహింపజేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి జగనన్న మద్యం దందాలకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వస్తే.. దేశవ్యాప్తంగా మరీ కక్కుర్తిగా వంద రెండొందల కోట్లు స్వాహా చేయడానికి అవినీతి చేసిన అన్ని ప్రభుత్వాల వారు.. జగనన్న సరళిని చూసి కొత్త పాఠాలు నేర్చుకుంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories