బేబీ జాన్” నాన్ థియేట్రికల్ హక్కులు ఎవరికో తెలుసా!

బాలీవుడ్ సినిమా లో విడుదలకి వచ్చిన తాజా మూవీ “బేబీ జాన్”. స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోగా,  కీర్తి సురేష్, వామికా గబ్బి కథానాయికలుగా దర్శకుడు కలీస్ రూపొందించిన  సాలిడ్ యాక్షన్ చిత్రం. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, దర్శకుడు అట్లీ కాంబోలో వచ్చిన చిత్రం “తేరి” కి రీమేక్ గా వచ్చింది. అయితే ఈ చిత్రం హిందీలో భారీ అంచనాలు ప్రమోషన్స్ నడుమ థియేటర్స్ లో విడుదలకి వస్తుంది.

మరి థియేటర్స్ తర్వాత ఈ సినిమా నాన్ థియేట్రికల్ గా వేటిలో  వస్తుందో ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా టెలివిజన్ హక్కులు జీ సంస్థ దక్కించుకుంది. సో థియేటర్స్ రన్ తర్వాత వీటిలో సినిమాలు రాబోతున్నాయని సమాచారం. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఒరిజినల్ సినిమా దర్శకుడు అట్లీ హిందీలో నిర్మించారు. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories