పేర్ని నానికి కత్తులు గొడ్డళ్లు తప్ప మరొకటి తెలియదేమో?

రాజకీయ ప్రత్యర్థుల మీద కడుపుమంట ఉండొచ్చు. అవకాశం దొరికితే వారిని కార్నర్ చేయాలని, విరుచుకుపడిపోవాలని కోరిక కూడా ఉండొచ్చు. రాజకీయాల్లో మనుగడ కోసం ఇది చాలా సహజం. కానీ… చేసే విమర్శలకు కనీసం కొంచెమైనా లాజిక్ ఉండాలి. మరీ కోడిగుడ్డుకు ఈకలు పీకినట్టుగా విమర్శలు చేస్తే.. అవి ప్రత్యర్థులకు చేసే నష్టమేమీ ఉండదు సరికదా.. జనం వాటిని చూసి నవ్వుతారు. ఆ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున.. ప్రతిరోజూ ప్రెస్ మీట్లు పెడుతూనే ఉండే పేర్ని నాని తెలుసుకుంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. విశాఖపట్నం జనసేన సభ తర్వాత.. పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి ఆయన చెబుతున్న మాటలే ఇందుకు కారణం.

పవన్ కల్యాణ్ విశాఖపట్నం సభలో తన ప్రస్థానం గురించి చెప్పుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను అనివార్యంగా చేయాల్సివచ్చిన త్యాగాల గురించి చెప్పుకున్నారు. కుటుంబానికి, సినిమాలకు కూడా అన్యాయం చేశానని.. తన జీవితంలో అధికభాగం రాజకీయం ఆక్రమించిందని ఆయన వివరించి చెప్పుకున్నారు. అలాగే.. పార్టీ సంస్థాగత నిర్మాణం విషయంలో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోయిన సంగతిని కూడా చెప్పుకున్నారు. ప్రజలు ఆశీర్వదించి అధికారంలోకి వచ్చాంగానీ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి వక్కాణిస్తూ.. అందుకు తన వద్ద కార్యచరణ ప్రణాళికను కూడా వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చిలో పార్టీ ఆవిర్భావదినోత్సవాన్ని పూర్తి సంస్థాగత బలంతో జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు.
ఈ ఏడాది విజయదశమి నుంచి ప్రతి నెలా పార్టీ కార్యకర్తలతో గడపడానికి పదిరోజుల సమయం కేటాయిస్తానని, పవన్ చెప్పారు. అప్పటినుంచి మార్చిలోగా పార్టీ బలోపేతం గురించి చెప్పారు. అలాగే.. ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో భారతదేశ పునర్నిర్మాణంలో ప్రతి జనసైనికుడిని కూడా భాగస్వామిని చేస్తానని.. దేశసేవలో ఉండేలా చేస్తానని పవన్ అన్నారు. ప్రతి జనసైనికుడు కూడా విజయదశమి నాటికి ఆయుధ పూజ చేసి.. రోడ్లమీదకు రావాలని పిలుపు ఇచ్చారు. నిజానికి ఆయన ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది.

అయితే ఈ మాటల్లో పేర్ని నానికి మాత్రం ప్రాణభయం, హత్యాకాండ కనిపించింది. ఆయన ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి.. తమ కార్యకర్తల్ని ఆయుధపూజ చేసి రోడ్లమీదకు రావాలని రెచ్చగొడుతున్నాడు. అలా ఏం చేయాలనుకుంటున్నారు. మా వైసీపీ కార్యకర్తల్ని చంపించాలని అనుకుంటున్నారా? ఇలాంటివాటికి భయపడేది లేదు.. అంటూ తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారు. పేర్ని నాని దృష్టిలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి దృష్టిలో ఆయుధాలు అంటే కత్తులు, గొడ్డళ్లు మాత్రమేనేమో అని ప్రజలు నవ్వుతున్నారు. ఎందుకంటే.. విజయదశమి ఆయుధ పూజ అంటే.. ప్రతి ఒక్కడూ కూడా తమ తమ పనిముట్లను పూజించుకుంటారు. వాహనాలను పూజించుకుంటారు. టీచర్లు విద్యార్థులు పుస్తకాలను పేనాలను పూజిస్తారు. అలాగే.. రైతు నాగలిని పూజిస్తాడు. ఇలా జరుగుతుంది. పవన్ కల్యాణ్.. మీ మీ కార్యరంగాలకు సంబంధించి పూజలు చేసుకుని దేశం కోసం రోడ్ల మీదకు రండి అన్నట్టుగా పిలుపు ఇస్తే.. ఆయుధపూజ చేసుకుని రమ్మంటున్నారు.. మమ్మల్నందరినీ చంపిస్తారా.. అని అంటున్న పేర్ని నాని వాచాలత్వం అసహ్యంగా ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories