హీరో అల్లరి నరేష్ నటించిన తాజా సినిమా ‘బచ్చల మల్లి’ డిసెంబర్ 20న గ్రాండ్ విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాను డైరెక్టర్ సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేయగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే, తాజాగా ఈ సినిమా నుండి మూడో సింగిల్ పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. ‘బచ్చల మల్లి’ నుంచి ‘‘మరీ అంత కోపం’’ అనే మూడో సింగిల్ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్దమౌతుంది. ఈ పాటను ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నారు. ఈ పాటను డిసెంబర్ 12న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో అందాల భామ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రాజేష్ దండ, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.