నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో ఇప్పటికే పలువురు స్టార్స్ సందడి చేయగా, బాలయ్య తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ టాక్ షో కు సంబంధించిన 7వ ఎపిసోడ్ టీజర్ కూడా బయటకు వచ్చింది.
అన్‌స్టాపబుల్-4 లేటెస్ట్ ఎపిసోడ్‌లో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి అన్‌స్టాపబుల్ సీజన్ 4 కేవలం 8 ఎపిసోడ్స్‌తో మాత్రమే ప్రసారం కానుందని తెలుస్తుంది. దీంతో ఈ టాక్ షో కి సంబంధించిన లాస్ట్ ఎపిసోడ్ షూటింగ్ కోసం నిర్వాహకులు రెడీ అవుతున్నారట. ఇక ఈ అన్‌స్టాపబుల్ సీజన్ 4 చివరి ఎపిసోడ్‌కి గెస్ట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ టాక్ షో షూటింగ్‌ను త్వరలోనే జరపబోతున్నట్లు సమాచారం.దీంతో అన్‌స్టాపబుల్ సీజన్ 4 లాస్ట్ ఎపిసోడ్‌కి చరణ్‌తో పాటు ‘గేమ్ ఛేంజర్’ యూనిట్ కూడా రాబోతుందని తెలుస్తోంది. కానీ, అభిమానులు ఎంతగానో వెయిట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి రాకుండానే అన్‌స్టాపబుల్ సీజన్ 4 ముగుస్తుండటంతో మెగా, నందమూరి అభిమానులు కొంచెం నిరాశ చెందినట్లు తెలుస్తుంది.