‘మిరాయ్’లో పవర్ చూపెట్టనున్న నటుడు…ఎవరో తెలుసా!

‘హనుమాన్’ మూవీ తర్వాత తన స్థాయిని అమాంతం పెంచుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ప్రస్తుతం తేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హీరో మూవీగా రానుంది.

ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాలో మరో విలక్షణ నటుడు రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

అయితే, ఈ పాత్రకు తొలుత దుల్కర్ సల్మాన్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పుడు ఈ సినిమాలో రానా దగ్గుబాటి జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories