నితిన్‌ సినిమాలో లేడీ బాస్‌ ఎవరో తెలుసా!

యంగ్‌ హీరో నితిన్‌ సరికొత్త కథతో రాబోతున్న సినిమా రాబిన్‌ హుడ్‌.. చాలా కాలం నుంచి నితిన్‌ ఖాతాలో ఒక్క హిట్‌ కూడా పడలేదు. దాంతో ఈసారి కొంచెం జాగ్రత్తగా కథను ఎంపిక చేసుకొని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే నితిన్‌ ఎంచుకున్న సినిమానే రాబిన్‌ హుడ్‌.  భీష్మా డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.

 ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరో మేకర్స్ చెప్పేశారు.ఈ సినిమా హీరోయిన్ ను అనౌన్స్ చెయ్యకుండా మూవీ మేకర్స్‌ ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉంచారు. తాజాగా పోస్టర్ తో హీరోయిన్ ఎవరనే దాని పై ఓ క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాకు హీరోయిన్ గా రష్మికను అనుకున్నారు. కానీ రష్మిక డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టు నుంచి రష్మిక తప్పకుందట.

 ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్‌ గా శ్రీలీల పేరు వినిపించింది. దానికి తగినట్టుగానే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories