మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబుతో మరో సినిమాకి ఓకే చెప్పాడు. అయితే గతేడాది చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార పుట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు పాపది ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. పాపవి కొన్ని ఫోటోలు బయటకు వచ్చినప్పటికీ వాటిలో కూడా ఎక్కడ క్లీంకార ముఖం చూపించలేదు.
దీంతో తమ అభిమాన హీరో ముద్దుల కూతురును చూడాలని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు. కాగా క్లీంకార అలాగే రామ్ చరణ్ పై నాగబాబు తనయ నిహారిక కొణిదెల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నిహారిక నిర్మాతగా అందరూ కొత్త వారితో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా మరి కొద్ది రోజుల్లో అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఓ ఇంటర్వూ లో మాట్లాడుతూ ” మా ఫామిలీలో ఇప్పుడు అందరి అటెన్షన్ క్లీంకారపైనే. క్లీంకార ముద్దుగా మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.
మా చరణ్ అన్నని ముప్పుతిప్పలు పెడుతోంది. ఫుడ్ పెట్టడానికి మా అన్న ఎన్నో సాహసాలు చేయాలి, కుక్క పిల్లను చూపించి అటు ఇటు తిప్పుతూ… చరణ్ అన్నని పరిగెత్తిస్తుంది. చరణ్ అన్నకి క్లీంకార అంటే ప్రాణం. నేను ప్రత్యక్షంగా చుసిన వాళ్లలో చరణ్ అన్న వరల్డ్ బెస్ట్ నాన్న. ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా తన కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. చరణ్ అన్న యాక్ట్ చేసిన సినిమా ఆస్కార్ గెలవడం, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ బాబాయ్ ఎమ్మెల్యేగా గెలవడం కూడా క్లీంకార వచ్చాకే జరిగాయి. మా ఇంటికి, మా అందరికి క్లీంకార లక్కీ డార్లింగ్” అని నిహారిక చెప్పుకొచ్చారు.