రంగంలోకి ఎవరు దిగారో తెలుసా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఉప్పెన ఫేం  డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా గురించి అందరికీ తెలిసిందే. చరణ్ కెరీర్ లో ఇది 16వ సినిమా కాగా దీని పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాని బుచ్చిబాబు ఒక పక్కా మాస్ అండ్ రూరల్ రస్టిక్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నట్లు ఓ టాక్‌ నడుస్తుంది.

దీని కోసమే ఓ సాలిడ్ టెక్నీషియన్ ని పట్టుకొచ్చినట్టుగా సమాచారం. ఈ చిత్రంలో వేషధారణ కోసం ఇటీవల కోలీవుడ్ చిత్రం “తంగలాన్” కోసం వర్క్ చేసిన ప్రముఖ టెక్నీషియన్ ఏగన్ ఏకాంబరం ఇప్పుడు చరణ్ 16వ సినిమాకి వర్క్ చేయబోతున్నారని సమాచారం. తంగలాన్ లో విక్రమ్ అలాగే మాళవిక మోహనన్ ఇలా రెండు తెగలకు చెందిన వారి డ్రెస్సింగ్ అంతా ఎంత సహజంగా ఉంటుందో చూసిన సంగతి తెలిసిందే.

మరి ఇలాంటి టెక్నీషియన్ ని చరణ్ సినిమా కోసం అంటే ఈ సినిమా కూడా ఎలా ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మోస్ట్‌  అవైటెడ్ మూవీ ఈ అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇక ఈ భారీ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Posts

Comments

spot_img

Recent Stories