కింగ్డమ్‌ ట్రైలర్‌ వచ్చేది ఎప్పుడో తెలుసా!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్పై అభిమానుల్లో మంచి హైప్ నెలకొంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే పోస్టర్లతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు అందరి చూపు ట్రైలర్‌పై పడింది.

తాజా సమాచారం ప్రకారం, కింగ్డమ్ ట్రైలర్‌ను జూలై 26న రిలీజ్ చేయాలని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ట్రైలర్ లాంచ్‌ను తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఆ ఈవెంట్ ఎలా జరగబోతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్షన్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అని మేకర్స్ నమ్ముతున్నారు. సత్యదేవ్ పాత్ర కూడా మంచి హైలైట్ కానుందని వారు చెబుతున్నారు. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories