బాలయ్య 109 టీజర్‌ వచ్చేది ఎప్పుడో తెలుసా?

నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా ..డైరెక్టర్ కొల్లి బాబీతో ఓ సాలిడ్ సినిమా ప్రాజెక్ట్ 109ని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి అటు అభిమానుల్లో కూడా సాలిడ్ అండ్ మాస్‌ హైప్‌ నెలకొంది. గత కొంతకాలంగా ఈ సినిమా టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారనే దాని మీద ఓ చర్చ నడుస్తుంది.

మరి దీనిపై దర్శకుడు బాబీ ఆల్రెడీ టైటిల్ సహా టైటిల్ టీజర్ ని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నట్లు వివరించాడు. కానీ మళ్ళీ అక్కడ నుంచి ఈ అప్డేట్ పై ఎలాంటి టాక్ వినిపించలేదు.ఫైనల్ గా ఇప్పుడు ఈ టైటిల్ టీజర్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద ఓ వార్త షికారు చేస్తుంది.

లేటెస్ట్ బజ్ ప్రకారం బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థాన వేడుకల్లో అయితే ఈ అవైటెడ్ సినిమా టైటిల్ టీజర్ ని లాంచ్ చేసే సన్నాహాలు జరుగుతున్నట్లుగా ఇప్పుడు రూమర్స్ వినపడుతున్నాయి. సో మరికొద్ది రోజుల్లోనే ఈ బిగ్ ట్రీట్ అభిమానుల ముందుకు రానుంది అని తెలుస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories