తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” సినిమా హంగామా ఆగడం లేదు. చాలా కాలం తర్వాత పవన్ కి సరైన హిట్ రావాలని ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఇప్పుడు పీక్ లెవెల్లో హైప్ కనిపిస్తోంది. ఈ ఉత్సాహం కారణంగా సినిమా విడుదలయ్యే ముందు నుంచే భారీ ఓపెనింగ్స్ రాబోతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన ఆల్బమ్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఫైర్ స్టార్మ్, ట్రాన్స్ ఆఫ్ ఒమీ, గన్స్ ఎన్ రోజెస్ లాంటి పాటలతో పాటు సువ్వి సువ్వి అనే మెలోడీ కూడా వినిపించగానే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ప్రతి సాంగ్ వేరే లెవెల్ లో హిట్ అవ్వడం ఈ సినిమా మీద మరింత బజ్ పెంచింది.
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ తన ఫోన్‌లో మాత్రం మొత్తం ఆల్బమ్ నుంచి ఒకే ఒక్క పాటని పెట్టుకున్నారని థమన్ చెప్పాడు.