నాగ చైతన్యకి ‘తండేల్’ సినిమా భారీ విజయాన్ని అందించడంతో ఇప్పుడు ఆయన కెరీర్‌లో కొత్త ఊపు వచ్చిందనే చెప్పాలి. ఆ హిట్ జోష్‌లో చైతూ ప్రస్తుతం కార్తీక్ దండ దర్శకత్వంలో ఒక ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాడు. ఇది మిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతుందని టాక్, ఆ కారణంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
అయితే ఇదంతా జరుగుతుండగానే చైతన్య మరో కొత్త సినిమా కోసం కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. తమిళ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు పిఎస్ మిత్రన్ తో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఆయన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో చైతూ ఓ స్పై పాత్రలో కనిపించనున్నాడని ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తోంది. మిత్రన్ గతంలో అభిమన్యుడు, సర్దార్ వంటి యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు చైతన్యను కూడా అంతే యాక్షన్ మూడ్‌లో చూపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికి ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉండొచ్చు కానీ చైతన్య ఇందులో చేయబోయే క్యారెక్టర్ మాత్రం యూనిక్‌గా ఉండబోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తిగా స్పై థీమ్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా అఫీషియల్‌గా ఎప్పుడు అనౌన్స్ అవుతుందన్నది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.