మిస్టర్‌ బచ్చన్‌ విడుదల తేదీ ఎప్పుడో తెలుసా!

 టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా అవైటెడ్ సినిమా “మిస్టర్ బచ్చన్”. ఈ సాలిడ్ బజ్ ఉన్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తన మార్క్ లో తెరకెక్కించగా ఇప్పుడు సినిమా విడుదలకు రంగం సిద్దమయ్యింది.

మరి ఈ గ్యాప్ లోనే టీజర్ ట్రీట్ పై కూడా మేకర్స్ అధికారిక క్లారిటీ అందించారు. ఇప్పుడు ఈ టీజర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర బృందం. ఈ టీజర్ ని మేకర్స్  జులై 28న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ రవితేజ, భాగ్యశ్రీ పై ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని విడుదల చేసి తెలిపారు. మరి ఇందులో ఇద్దరి డ్రెస్సింగ్ వింటేజ్ స్టైల్ లో కనిపిస్తుండగా ఇదేదో సాంగ్ కి సంబంధిచిందని తెలుస్తుంది.

అల్రెడీ బచ్చన్ షో రీల్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కేజీయఫ్ ఎడిటర్ తో హరీష్ శంకర్ ఈ సినిమా టీజర్ ని కట్ చేయించడం దాని విషయంలో హ్యాపీగా ఉన్నానని చెప్పడం కూడా తెలిసిందే. మరి రేపు రానున్న ఈ టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తుండడంతో ఈ ఆగస్ట్ 15న సినిమా విడుదలకు రంగం సిద్దం కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories