యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన తాజా సినిమా థగ్ లైఫ్ చివరికి థియేటర్లకి వచ్చేసింది. మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా పలు మార్లు వాయిదా పడిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఇద్దరూ చాలా ఏళ్ల తర్వాత కలిసి పనిచేయడం వల్ల భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ప్రేక్షకుల నుంచి ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో స్పందన రాకపోవడం మాత్రం కొంత అసంతృప్తిని కలిగించింది. ప్రత్యేకించి కమల్, మణిరత్నం కాంబినేషన్ మీద ఆశలు పెట్టుకున్న వాళ్లకు ఇది నిరాశగా మారింది.
ఇప్పుడు సినిమా థియేటర్లలో ఆడుతుండగా, థగ్ లైఫ్ నాన్ థియేట్రికల్ హక్కుల వివరాలు బయటకు వచ్చాయి. ఓటీటీ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. అందులోనూ అన్ని భాషల్లో ప్రసారం చేయనున్నట్టుగా సమాచారం. ఇక టీవీ ప్రసార హక్కులు స్టార్ మా చేతికి వెళ్లినట్టు తెలుస్తోంది. అంటే థియేటర్ తర్వాత థగ్ లైఫ్ ఓటీటీతో పాటు టెలివిజన్ ద్వారా కూడా ప్రేక్షకులను చేరుకుంటుందనిపిస్తోంది.