లావు సవాలు చేసే దమ్ము తెదేపా నేతలకు ఉందా?

మసిగుడ్డ కాల్చి మొహాన పడేయడం మాత్రమే వారికి తెలిసిన విద్య! మసి అంటిన వాడు మొహం కడుక్కోవాల్సిందే! అలా తమ రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లడంలో ఆరితేరిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ దళాలు అందులో హద్దూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఎక్కడ అల్లర్లు జరిగినా దానికి కారకులు ఎవరైనా సరే.ముందుగా తెలుగుదేశం వారిపై బురద చల్లేయడం వారు చేసే పని. ఆ పార్టీ అధికారంలో ఉండగా పోలీసులను తెలుగుదేశం ప్రభావితం చేస్తున్నది అంటూ.. మధ్యలో ఎన్నికల సంఘాన్ని  కూడా రచ్చకీడ్చి బురద చల్లడం వారి ప్రత్యేకత. అలాంటివారికి నరసరావుపేట ఎంపీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన సవాలు కొరుకుడు పడడం లేదు. అవసరమైతే తన కాల్ డేటాను పరిశీలించాలని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగానే ఉంటానని లావు శ్రీకృష్ణదేవరాయలు అనడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలను విస్మయపరుస్తోంది. అదే తరహాలో తమ కాల్ డేటాను పరిశీలించుకోవచ్చునని చెప్పగల దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడికైనా ఉన్నదా అనే ప్రశ్న ప్రజల నుంచి ఎదురు అవుతోంది.

పల్నాడులో జరిగిన హింసాత్మక సంఘటనలు అల్లర్లకు సంబంధించి.. అక్కడ విధుల నుంచి తప్పించబడిన ఎస్పి బిందు మాధవ్ తో లావు శ్రీకృష్ణదేవరాయలకు బంధుత్వం ఉన్నదని, ఆయన ఎస్పీ ద్వారా జిల్లాలోని పోలీసు వర్గాలందరినీ ప్రభావితం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే విని వారు సృష్టించిన కట్టుకథలని లావు శ్రీకృష్ణదేవరాయలు ఖండిస్తున్నారు.

లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. నరసరావుపేట ఎంపీ పరిధిలోని వైసిపి ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఆయన పట్ల ఒక సానుకూల అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు ఎంపీ నియోజకవర్గానికి బదిలీ చేయాలని అనుకున్నప్పుడు.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా అడ్డుపడ్డారు. ఆయన లేకపోతే తమ తమ ఎమ్మెల్యే నియోజకవర్గాలలో పార్టీ విజయం కూడా ప్రశ్నార్థకం అవుతుందని వారు గొల్లుమన్నారు. అయినా వారి అభ్యంతరాలు ఏవి పట్టించుకోకుండా జగన్ తన ఒంటెత్తుపోకడలతో వ్యవహరించినందున.. లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరి చేరారు. ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు.

ఈ పోకడ సహించలేకపోతున్న వైసీపీ దళాలు ఆయన మీద వీలైనంతగా బురద చల్లారని ప్రయత్నిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత తమ ఓటమి అర్థమైపోయేసరికి.. లావు శ్రీకృష్ణదేవరాయలకు తొలగించబడిన ఎస్పీ బిందు మాధవ్ కు బంధుత్వం ఉందని అంటూ దానిని వాడుకుని లావు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని బురద చల్లుతున్నారు. లావు కృష్ణదేవరాయలు గెలిస్తే అది అక్రమమైన గెలుపు అని ఆరోపించడానికి ఇప్పుడే రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే తన కాల్ డేటా పరిశీలించుకోవచ్చుననే లావు సవాలుకు వారి నోర్లు మూతపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories