మళ్లీ నిరాశే!

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులలో బిగ్గెస్ట్ ఎక్స్‌పెక్టేషన్ ఏర్పడిన సినిమా ఏదైనా ఉందంటే, అది సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా ఇంకా అఫీషియల్ టైటిల్ కూడా రాలేదు కానీ, ముందు నుంచే భారీ హైప్‌ ఏర్పడింది.

ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం మహేష్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా స్పెషల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని అభిమానులు గట్టిగానే అనుకున్నారు. కానీ ఆ రోజు మేకర్స్ చేతులెత్తేసారు. ఇప్పుడు ఈ ఏడాది అయినా ఏదైనా స్పెషల్ అప్‌డేట్ వస్తుందేమో అని ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఈసారి కూడా నిరాశే ఎదురవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ రూమర్లలో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొంత టైం వేచి చూడాల్సిందే. కానీ మరోవైపు వినిపిస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, రాజమౌళి మాత్రం ఈ సినిమాను భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తెరకెక్కించడానికి ప్లానింగ్ చేస్తున్నారట.

ఇంకా మొదలుకాకపోయినా, ఈ సినిమా 2027లో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అంటే చెప్పాలి గానీ.. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ ఆలస్యం అయినా, సినిమా మీద ఆసక్తి మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories