టాలీవుడ్ లో ఉన్నటువంటి సక్సెస్ ఫుల్ దర్శకుల్లో వరుస హిట్స్ దర్శకుడు త్రినాధరావు నక్కిన కూడా ఒకరు. తన సినిమాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మంచి హిట్ గా నిలవగా తన నుంచి లేటెస్ట్ గా వచ్చిన “మజాకా” చిత్రం కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకుంది. యంగ్ హీరో సందీప్ కిషన్ తో చేసిన ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతుండగా అప్పుడే మజాకా దర్శకుడు తన నెక్స్ట్ సినిమా ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన “నువ్విలా” సినిమా ఫేమ్ యంగ్ హీరో హవీష్ కోనేరుతో ఇపుడు సినిమా చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు కూడా జరుగగా షూటింగ్ కూడా ఈ రెండు రోజుల్లోనే మొదలు కానుందట. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు బయటకి రావాల్సి ఉన్నాయి.