అమెరికాలో నిర్వహించిన తెలుగు సంబరాల్లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సాధారణంగా తన స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏ ఈవెంట్‌కైనా బాలయ్య హాజరైతే అక్కడ ఎనర్జీ డబుల్ అయిపోవడం కామన్. ఆయన చేసే క్యూట్ ఫన్నీ గెస్టర్స్ అభిమానులకైతే ఒక ఫెస్టివల్లానే ఉంటుంది. ముఖ్యంగా ఆయన సెల్‌ఫోన్‌ను గాల్లో తిప్పుతూ చేసే సిగ్నేచర్ స్టెప్ బాలయ్య ఫ్యాన్స్‌కి బాగా తెలిసినదే.
ఇక అదే స్టెప్‌ను తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాస్త సరదాగా ట్రై చేశారు. బాలయ్య పక్కనే కూర్చున్న దిల్ రాజు, ఆయన మార్క్ సెల్‌ఫోన్ స్టెప్‌ను ఆ ఈవెంట్లో రిపీట్ చేశారు. సెల్‌ఫోన్‌ను గాల్లోకి వేస్తూ బాలయ్య స్టైల్‌ను అనుకరించడంతో, పక్కనే ఉన్న బాలయ్య కూడా ఒక్కసారి షాక్ అయ్యారు. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఈ సరదా సీన్‌ని ఆశ్చర్యంగా చూసారు.
ఈ సరదా క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దిల్ రాజు చేసిన ఆ స్టెప్‌కు నెటిజన్లు సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. బాలయ్య స్టైల్‌కి ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్‌ను మరోసారి ఈ వీడియో బయటపెట్టింది.