ఇలా కెలకడం ద్వారా సెల్ఫ్ గోల్ వేసుకున్నారా?

తిరుపతిలో టిడిఆర్ బాండ్ల రూపేణా జరిగిన వందల వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం గురించి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని రోజుల కిందట తీవ్రమైన విమర్శలు చేశారు. అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న ఒక ఐఏఎస్ అధికారిణి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె అవినీతి అనకొండ అంటూ నానా మాటలు అన్నారు. ఇదంతా జగన్ కు సన్నిహిత వర్గంలోని ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి గురించే అని అందరికీ అర్థమైంది. ఆమె మీద నిందలు వేయడం ద్వారా టీడీఆర్ బాండ్ల వ్యవహారాన్ని, దోపిడీని కెలికిన కరుణాకర్ రెడ్డి చివరికి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా పరిస్థితి తయారైందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎందుకంటే టి డి ఆర్ బాండ్ల కుంభకోణం రూపేణా తిరుపతిలోనే 2000 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లోనే ఆయన అనుచరులు పాల్పడిన దోపిడీ మాత్రమే అనే పుకార్లు కూడా ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి తాను వ్యక్తిగతంగా ఏ కుంభకోణంలోనూ లేను అని సర్టిఫై చేసుకోవడం కూడా ఈ వాదనకు మద్దతుగా ఉంది. అనుచరులు ప్రభుత్వ ఖజానాను దోచుకుంటూ కోట్ల రూపాయలు దండుకోవడానికి భూమన వెనుక నుంచి సమస్త అండదండలు సమర్పించినట్లుగా ప్రచారం ఉంది.

అదేవిధంగా తిరుపతిలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సంబంధించి పుంగనూరు అప్పటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల దందా కూడా బీభత్సంగా ఉన్నట్లు సమాచారం. ఎక్కడ ఖాళీ జాగా కనపడితే దానిని ఆక్రమించుకోవడం టిడిఆర్ బాండ్లు రూపేణా ప్రజా అవసరాలకు దానిని ప్రభుత్వానికి కేటాయించడం ప్రత్యామ్నాయంగా తమ భూములు పొందడం ఇదే అక్రమ దందాలను పెద్దిరెడ్డి అనుచరులు కూడా విచ్చలవిడిగా సాగించినట్లుగా అందరూ చెప్పుకుంటున్నారు.

కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తిరుపతి టి డి ఆర్ బాండ్ల కుంభకోణం గురించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలంటూ కొత్త డిమాండ్ లేవనెత్తారు. జగన్ జమానాలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కుంభకోణాలు అనేకం జరిగాయని ఆరోపిస్తున్న ఆయన తిరుపతి కుంభకోణానికి ఒక అధికారి పూర్తి పాత్ర నిర్వహించినట్లుగా గుర్తు చేస్తున్నారు. భూమన, పెద్దిరెడ్డి, ,శ్రీ లక్ష్మీ అందరి పాత్రలూ బయటకు వస్తాయని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. రెచ్చిపోయి విమర్శలు చేడయం ద్వారా..  భూమన పరిస్థితి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా తయారవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories