నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు బాబీ కొల్లి పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇప్పుడు ఆమె పాత్రకు సంబంధించిన సీన్స్ తీసేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఊర్వశి రౌటేలా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నుంచి ఆమె సీన్స్ ఎందుకు తీసేస్తున్నారు.. అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగానే ‘డాకు మహారాజ్’లో ఊర్వశి సీన్లు కనిపించవా… అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.