నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో ఎలాంటి జోష్‌లో ఉన్నారో అందరికీ తెలిసిందే. ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టడం కంటే తెరపై అగ్రెషన్‌తో నడిపించడమే అభిమానులు ఆశపడే విషయం. అలాంటి బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ వైపు నుంచి వినపడుతోంది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు జన నాయగన్ అనే సినిమా చేస్తున్నారు. ఇది అసలు భగవంత్ కేసరి రీమేక్ అని ఇప్పటికే కొంతమంది చెబుతున్నారు. ఆ సినిమా లోని పాయింట్లు, కొన్నిసీన్లు చూస్తే అలాంటిదే అనిపిస్తుంది. మొదట్లో ఈ రీమేక్‌కి అనీల్ రావిపూడిని తీసుకోవాలని ఆలోచించినట్లు తెలిసింది. కానీ ఆ ప్లాన్ అవ్వలేదు. ఏ కారణం వల్ల ఆ ఐడియా డ్రాప్ అయిందో స్పష్టంగా తెలియదు.
ఇప్పటివరకు జన నాయగన్ పూర్తిగా భగవంత్ కేసరి రీమేక్ అనే క్లారిటీ రాలేదు. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు, జన నాయగన్ టీం భగవంత్ కేసరి సినిమాలోని “గుడ్ టచ్ బ్యాడ్ టచ్” అనే సీన్‌కు సంబంధించిన రైట్స్ మాత్రమే తీసుకున్నారట. మిగిలిన కథ, సన్నివేశాలు అన్నీ కొత్తగా రూపొందిస్తున్నారట. అంటే ప్యూర్ రీమేక్ కాదు, ఇన్స్పిరేషన్ తో తయారవుతున్న ఓ కథ అనిపిస్తోంది.
ఈ ఒక్క సీన్ కోసం భారీ మొత్తం వెచ్చించి హక్కులు తీసుకున్నారని టాక్. అయితే ఈ విషయం మీద ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ట్రైలర్ లేదా టీజర్ వస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.