జగన్మోహన్ రెడ్డి క్షణికావేశానికి, ఉద్రేకపూరితమైన ప్రతిస్పందనలకి ముద్రపడ్డ ప్రజా నాయకుడిగా ఆయన పార్టీలోని వారే చెబుతూ ఉంటారు. తనకు ఇష్టం లేని విషయాలు జరుగుతున్నప్పుడు ఆయన ప్రతిస్పందించే తీరు చాలా దారుణంగా, ఉగ్రంగా ఉంటుందని అంటూ ఉంటారు. గతంలో తనకు ఇష్టం లేని హైకోర్టు తీర్పులు, పరిణామాలు జరిగిన కొన్ని సందర్భాలలో ఆయన ఇంట్లో అత్యంత ఆవేశపూరితంగా మారి, చూస్తున్న టీవీని పగలగొట్టారని కూడా పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి. అలాంటిది ఇవాళ అత్యంత దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఎంత అగ్రహానికి గురయ్యారో.. ఆయనలో ఎంత ఆవేశం పొంగుతుందో.. దాని ఫలితంగా ఆయన ఇంట్లో ఏమేం విలువైన వస్తువులు పగులుతున్నాయో కదా అని ప్రజలు అనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను మోనార్క్ ని అని భావిస్తారు. తన మాటకు ఎదురు ఉండకూడదు అని ఆశిస్తారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా నడిపారు. పార్టీలో ఎందరు సీనియర్లు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవ్వరి మాటలు కూడా వినరని, ఎవరి సలహాలు అడగరని పేరు ఉంది. పైగా పార్టీ నిర్ణయాల విషయంలో అయినా సరే ఎవరైనా తనకు ఎదురు చెబితే చాలా ఆవేశంగా స్పందిస్తారని అందరూ అంటుంటారు. ఆవేశం అనర్థాలకు మూలం అనేది తెలిసిన సంగతే.
మామూలు విషయాలకే పట్టలేనంత ఆవేశం తెచ్చుకుని ఖరీదైన టీవీని బద్దలు చేసే అంతటి ఉగ్ర స్వరూపుడు.. ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల విషయంలో ఎంత కోపానికి లోనై ఉంటారో కదా అని ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే జగన్ ఇంట్లోని టీవీ ఖరీదైన ఫోన్లు, ఐప్యాడ్, లాప్టాప్ వంటి ఖరీదైన వస్తువులు ఏవైతే పగలగొడితే పగిలే స్థితిలో ఉంటాయో అలాంటివన్నీ కూడా ముక్కలు చెక్కలైపోయి ఉండాలని ప్రజలు ఊహిస్తున్నారు.
నిజానికి రాజీనామా చేయడానికి గవర్నరు బంగళాకు వెళ్లడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి మొహం చెల్లలేదని సమాచారం. ముఖ్యమంత్రిగా తన రాజీనామా లేఖను ప్రతినిధి ద్వారా గవర్నరుకు పంపాలని ఆయన భావించినప్పటికీ.. సన్నిహితులు కొందరు సర్ది చెప్పడం వలన.. స్వయంగా వెళ్లి ఇవ్వడానికి ఒప్పుకున్నారని కూడా అంటున్నారు.