చివరి  సినిమా విడుదల అప్పటికి మార్చేశారా!

ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇపుడు తన కెరీర్ చివరి సినిమా చేస్తున్న విషయం  తెలిసిందే. తన కెరీర్లో 69వ సినిమాగా బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “భగవంత్ కేసరి” ని రీమేక్ చేస్తున్నట్టుగా స్ట్రాంగ్ రూమర్స్ అయితే వినపడుతున్నాయి. మరి ఈ మూవీని డైరెక్టర్‌ హెచ్ వినోద్ తెరకెక్కిస్తుండగా విజయ్ చివరి సినిమాగా భారీ హైప్ నెలకొంది.

ఇలా ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. నిజానికి ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాదిలోనే దసరా రేస్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ ఇపుడు ఈ సినిమాని ఈ ఏడాది నుంచి పూర్తిగా తప్పించినట్టుగా తెలుస్తుంది. దీనితో వచ్చే ఏడాది జనవరి సంక్రాంతి రేస్ లోకి మార్చేశారంట. సో ఇది కనుక నిజం అయితే విజయ్ ఫ్యాన్స్ ఈ ఏడాది అంతా ఆగాల్సిందే మరి…

Related Posts

Comments

spot_img

Recent Stories