ఆ ఇద్దరినీ జగన్ దళాలు మేనేజి చేశాయా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచర గణాలు కలిసి దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలు కాజేసిన, 18 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనానికి నష్టం కలిగించిన మద్యం కుంభకోణం ఇప్పుడు ఉన్నరూపంలో ఉన్నదంటే.. ఆ స్థాయిలో చురుగ్గా దర్యాప్తు సాగుతున్నదంటే అందుకు ప్రధానంగా ఇంద్దరు అధికారులు వాంగ్మూలాలే కారణం అని చెప్పాలి. ఆ ఇద్దరిలో ఒకరు.. జగన్ పరిపాలన  కాలంలో కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ సంస్థకు ఎండీగా పనిచేసిన.. దోపిడీ మొత్తానికి సంధానకర్తగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి, మరొకరు ఎక్సయిజు శాఖలో ప్రత్యేకాధికారిగా నియమితులైన సత్యప్రసాద్. కనీసం ఎక్సయిజు మంత్రికి కూడా ఎలాంటి సమచారం లేకుండా వీరంతా జగన్ నియమిత గణాలకు సహకరిస్తూ దోపిడీ పర్వంలో తాము భాగం అయ్యారు. అయితే కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత లిక్కర్ కుంభకోణంపై కేసులు నమోదు అయినప్పుడు.. తొలుత దాదాపు అప్రూవర్లుగా మారి వివరాలు వెల్లడించింది వీరే! వీరందించిన వివరాలతోనే చాలా మంది పేర్లు కేసులోకి వచ్చాయి. వారిద్వారా మరిన్ని వివరాలు తెలుస్తూ సాక్ష్యాధారాలు సిట్ వద్ద సమకూరాయి. అయితే ఈ అధికార్లను బెదిరించి తమకు కావాల్సినట్టుగా వారితో వివరాలు చెప్పించుకున్నారు అని.. జగన్మోహన్ రెడ్డి అండ్ కో నిన్నటిదాకా పదేపదే ఆరోపిస్తూ వచ్చారు. అయితే తాజాగా కేసు విచారణపర్వం ముదిరి పాకాన పడుతున్న నేపథ్యంలో.. ఆ ఇద్దరు అధికార్లను జగన్ దళాలు మేనేజ్ చేసేసినట్టుగా కనిపిస్తోంది. రెండు దఫాలుగా వారు ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్లు దాఖలు చేయడం,  ఆ క్రమంలోని పరిణామాలు ఇలాంటి అనుమానాలను కలిగిస్తున్నాయి.

మద్యం కొత్త పాలసీ రూపంలో జరిగిన మొత్తం దోపిడీకి కేంద్రస్థానం ఏపీ బెవరేజెస్ కార్పొరేషనే గనుక.. దాని ఎండీగా దోపిడీకి సహకరించిన వాసుదేవరెడ్డిని తొలుతే సిట్ విచారించింది. అప్పట్లోనే అనేకపేర్లు బయటకు వచ్చాయి. నిజానికి మాస్టర్ మైండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు కూడా అప్పుడే బయటకు వచ్చింది. కేవలం పేపర్లో వచ్చిన వార్తల్లో చూసి, వాసుదేవరెడ్డి తన పేరు చెప్పినట్టు తెలుసుకుని, ఆయన అప్పుడే భయపడి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించి భంగపడ్డారు. అయితే ఈ ఇద్దరు అధికారులు తమ పరిధిలో జరిగిన మొత్తం తంతును సిట్ కు చెప్పేశారు. వారిని బెదిరించి తమకు అనుకూలంగా చెప్పించుకున్నారంటూ జగన్ దళాలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నాయి.

కాగా వారు తాజాగా కొన్ని రోజుల కిందట ముందస్తు బెయిలు కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు. ఆ సమయంలో తాము అప్రూవర్లుగా మారుతామని కూడా పిటిషన్ వేశారు. సాంకేతిక కారణాలతో అవి రిజెక్ట్ అయ్యాయి. తాజాగా మళ్లీ ముందస్తు బెయిలుకోసం పిటిషన్లు వేశారు. కానీ అప్రూవర్ పిటిషన్లు వేయలేదు. ఈ మధ్య వ్యవధిలోనే.. ఆ ఇద్దరు అధికారులను జగన్ దళాలు మేనేజ్ చేశాయా? వారు అప్రేవర్లుగా మారి అసలు విషయాలు వెల్లడిస్తే.. తమ కోటల పునాదులు కదులుతాయని జగన్ వర్గం భయపడుతోందా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. పరిస్థితి ఎలా తయారైనదంటే.. లిక్కర్ పాలసీ రూపకల్పన, పరిమితంగా నిర్వహణ లో భాగం ఉన్న ఈ ఇద్దరు అధికారులు వాంగ్మూలాలకు ఇప్పుడు మరీ అంత ప్రయారిటీ తగ్గింది. వసూళ్లలో, దోచిన డబ్బును దాచడంలో కీలకమైన వరుణ్ పురుషోత్తం స్వయంగా నగదు డంప్ లు ఎక్కడ ఉన్నాయో చెప్పేస్తుండగా.. నేరం ఒప్పేసుకుంటుండగా.. జగన్ పాపం పూర్తిగా పండినట్టేనని పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories