టిల్లుకి ఒకే చెప్పాడా లేదా?

టిల్లుకి ఒకే చెప్పాడా లేదా? టాలీవుడ్ స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘జాక్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ‘తెలుసు కదా’, ‘కోహినూర్’ చిత్రాలను కూడా తెరకెక్కిస్తున్నాడు ఈ యంగ్ హీరో. 

ఇక ఇప్పుడు మరో డైరెక్టర్‌కు సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినపడుతుంది.‘గీతా గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న దర్శకుడు పరశురామ్ పెట్లా ఇప్పుడు మరో సాలిడ్ కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి వినిపించగా, ఆయన ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పారట. 

ఇక ఈ సినిమా కథను సిద్ధు జొన్నలగడ్డకు కూడా పరశురామ్ వినిపించాడని.. కథ నచ్చడంతో సిద్ధు కూడా ఈ చిత్రానికి పచ్చ జెండా ఇచ్చినట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినపడుతున్నాయి.మరి నిజంగానే ఈ డైరెక్టర్‌కు సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా.. ఒకవేళ ఇస్తే ఈ సినిమాలో అతని పాత్ర ఎలా ఉండబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories