జగన్ ఓడిపోతారనే.. సీబీఐ అలా చెప్పిందా?

ఎన్నికలు జరుగుతున్నప్పుడు వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెందిన నిఘా సంస్థలకు ముందుగానే అర్థమైపోతూ ఉంటుంది. వారు ప్రభుత్వాధినేతలకు నివేదించడం తప్ప ఎక్కడా బయటపడరు. సర్వేసంస్థలు, ఎగ్జిట్ పోల్స్ తేల్చే ఫలితాల కంటె ఖచ్చితంగా ప్రభుత్వ నిఘా సంస్థలు జనం నాడిని పసిగడుతుంటాయి. కాకపోతే వారు బయటపడరు.కానీ.. కొన్ని సంకేతాలను బట్టి ఎన్నికల ఫలితాలపై ఆ సంస్థల అంచనాలు ఏమిటో మనం గ్రహించవచ్చు. ఆ కోణంలో చూసినప్పుడు.. ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని కేంద్ర దర్యాప్తుసంస్థ సీబీఐ అభిప్రాయపడుతున్నదా? అనే అనుమానం కలుగుతోంది. ఆ కారణం చేతనే జగన్మోహన్ రెడ్డి విదేశీ యాత్రకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ కోర్టులో తమ కౌంటర్ దాఖలు చేసిందా అని పలువురు అనుకుంటున్నారు.

ఎన్నికల పర్వం పోలింగ్ నాడు ముగిసిన వెంటనే కాస్త విదేశాలకు వెళ్లి రిఫ్రెష్ కావాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే పలుచోట్ల ఇరుపక్షాలు కొట్లాడుకుంటున్న దుర్ఘటనలువెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి.. రీపోలింగ్ అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని జగన్ 17వ తేదీనుంచి యూరప్ యాత్రకు వెళ్తానని ఆయన సీబీఐ కోర్టును అనుమతి కోరారు. ప్రస్తుతం ఆయన బెయిలు మీద బయట ఉన్న నిందితుడు గనుక.. తలచిన వెంటనే విదేశాలకు వెళ్లిపోవడం కుదరదు. అందుకే అనుమతి అడగాల్సి వచ్చింది. ఈ పిటిషన్ ను విచారించి.. కోర్టు సీబీఐ అభిప్రాయం కోరింది. తాజాగా సీబీఐ ఆయనకు విదేశీయాత్రకు అనుమతి ఇవ్వవద్దని కౌంటర్ దాఖలు చేసింది. 14వ తేదీకి వాయిదా వేసిన సీబీఐ కోర్టు తమ నిర్ణయాన్ని ఆరోజున వెల్లడిస్తుంది.

ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే.. అభ్యంతరం వ్యక్తం చేయడం వెనుక సీబీఐ కు జగన్ ఎన్నికల్లో ఓడిపోతారేమోననే అనుమానం ఉన్నదేమో అని! జూన్ 1 నాటికి మనదేశంలో ఎన్నికల పర్వం ముగుస్తుంది. మన రాష్ట్రంలో 13నే పూర్తవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అనేవి.. చివరి విడత వరకు బహిరంగంగా బయటకు రాకపోవచ్చు గానీ.. పెద్దలందరికీ సమాచారం తెలిసిపోతుంది. ఓటమి ఖరారు అయితే.. జగన్ విదేశాల నుంచి తిరిగి ఇండియా రాకుండా అక్కడే ఉండిపోతారేమోననే అనుమానం సీబీఐకు ఉండవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు. ఓటమి సంకేతాలు తెలిస్తే ఆయన తిరిగి రారనే ఉద్దేశంతోనే.. విదేశీ యాత్రకు ఈ సమయంలో అనుమతి వద్దని వారు కౌంటర్ వేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories