అమెజాన్‌ లో అదరగొడుతున్న ధూం..ధాం!

యంగ్ హీరో చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా రూపుదిద్దుకున్న సినిమా ‘ధూం ధాం’. కాగా ఈ మూవీ 16 రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షమైంది. అయితే ఇండియా పరంగా అమెజాన్ స్ట్రీమింగ్‌లో టాప్ 10లో మొదటి రోజు ఉండగా… 16 వ రోజు వరకు కూడా టాప్‌ 9 లోనే ఉంది.

ఇండియా పరంగా చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికంగా చూసే కామెడీ సినిమాల్లో ఈ మూవీ  కూడా ఓ మూవీ. ఇప్పటివరకు ఈ చిత్రం 40 మిలియన్ల మినిట్స్ ను క్రాస్‌ చేసింది. పైగా ఇప్పటికీ మంచి వ్యూస్ ను రాబడుతుంది. ఇందులో భాగంగానే త్వరలో అమెజాన్ వారు ప్రపంచవ్యాప్తంగా 126 కంటే ఎక్కువ దేశాలలో ఈ చిత్రాన్ని అప్‌లోడ్ చేస్తున్నారు. అమెజాన్ స్ట్రీమింగ్‌లో హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కూడా త్వరలో విడుదల చేస్తున్నారు. మా సినిమాను గరిష్ట సంఖ్యలో ప్రేక్షకులకు చేరువ కావడం మాకు సంతోషంగా ఉంది అంటూ టీం ధన్యవాదాలు తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories