తగ్గేదేలే అంటున్న ధనుష్‌!

కోలీవుడ్ గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా ఇపుడు తెలుగు సహా తమిళ్ లో కూడా పలు చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ములతో “కుబేర” సినిమా చేస్తూ ఫుల్‌  బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చేస్తున్న టైమ్‌ లోనే  లేడీసూపర్‌ స్టార్‌  నటి నయనతారకి ఒక ఊహించని షాక్ ఇచ్చాడు.

ఆమె పెళ్లి డాక్యుమెంటరీలో తన మూవీ “నానుమ్ రౌడీ దాన్” అనే చిత్రంలో  ఒక మూడు సెకన్ల విజువల్‌ క్లిప్‌  ఉండడంపై 10 కోట్లు తనకి కట్టాలని ధనుష్‌ కేసు వేశాడు. దీని పై నయన్ కూడా పెద్ద ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఈ తర్వాత ధనుష్ సైలెంట్ గానే ఉన్నాడు అని చాలా మంది అనుకున్నారు కానీ ఇపుడు తాను కోర్టు వరకు వెళ్లినట్టుగా సమాచారం.

తన నిర్మాణ సంస్థ వుండర్బేర్ ఫిల్మ్స్ వారు మద్రాస్ హై కోర్ట్ మెట్లేక్కారు. దీనితో ఇది ఊహించని ట్విస్ట్ గా మారింది. దీంతో నయన్ విషయంలో మాత్రం ధనుష్ తగ్గేదేలే అంటున్నాడు. మరి నయన్ 10 కోట్లు ధనుష్‌ కి ఇస్తుందా లేక మరో రకంగా పోరాడుతోందా అనేది మాత్రం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories