ఈ ఏడాదిలో సౌత్ హీరోల నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. అలాంటి వారిలో ధనుష్ కూడా ఒకరు. ఆయన ఈ సంవత్సరం ఇప్పటికే కుబేర, ఇడ్లీ కొట్టు సినిమాలతో ప్రేక్షకులను కలిసాడు. కానీ ఇక్కడితో ఆగిపోకుండా మూడో సినిమాను కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. అదే ఆయన బాలీవుడ్ సినిమా “తేరే ఇష్క్ మైన్”. ఈ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది.
ఇదే కాక మరో రెండు నెలల గ్యాప్ లోనే ధనుష్ నుంచి మరో సినిమా రానుంది. ఇది ఆయన కెరీర్ లో 54వ చిత్రం అవుతుంది. ఈ సినిమా దర్శకత్వం విగ్నేష్ రాజా వహించారు. షూటింగ్ పనులు ఇటీవల పూర్తవ్వడంతో ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.