కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్ గా మారి చేసిన సినిమా రామం రాఘవం..ఈ సినిమా ని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ అరిపాక సమర్పిస్తుండగా పృథ్వీ పోలవరపు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఈ సినిమాలో సముద్ర ఖని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ శనివారం విడుదల అయ్యింది. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, నటులు సూరి,దీపక్ ,హరీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఈ సినిమా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా గురించి దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ రచయిత శివప్రసాద్ కథ ఇదని వివరించారు. ఈ కథ గురించి సముద్ర ఖని అన్నకి వివరించాను, దాంతో కథను నువ్వే డైరెక్ట్ చేయాలిని చెప్పారు. నేను నటించిన చిత్రాలకు పనిచేసిన దర్శకుల నుండి నేను నేర్చుకున్న విషయాల ఆధారంగా నేను ఈ సినిమాకి దర్శకత్వం వహించా. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించా, ఆ సినిమా దర్శకులు అందరూ నా గురువులే. వారు నేర్పిన పాఠాలతో ఈరోజు దర్శకుడిగా మారా, సముద్రఖని అన్న లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేది కాదు, నేను దర్శకుడిని అయ్యే వాడిని కాను. అందరూ వాళ్ళ తండ్రులతో కలిసి ఈ సినిమా చూడాలని ధనరాజ్ అన్నారు.
ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ… సంతోషకరమైన సమయం ఇది. నేను తండ్రిగా సుమారు 10కి పైగా సినిమాల్లో నటించా, ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ స్టోరీ. అలాంటి మరో కొత్త కథ ఇదన్నారు. ధనరాజ్ కి తల్లిదండ్రులు లేరు. స్వతహాగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. మంచి కథ ఇది, అందుకు తగ్గ దర్శకుడు ఉండాలని భావించాను. ధనరాజ్ పై నాకు పెద్ద నమ్మకం ఉంది. అందుకే, అతన్నే దర్శకత్వం చేయమని చెప్పా. దర్శకుడిగా అతను పెద్ద విజయాన్ని అందుకుంటాడు, తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని చాటే చిత్రం ఇదని పేర్కొన్నారు.