పెళ్లి చేసుకున్న జాలిరెడ్డి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా హిట్ చిత్రం “పుష్ప” సినిమాలో జాలి రెడ్డి అనే సాలిడ్ పాత్రలో కనిపించిన కన్నడ నటుడు ధనంజయ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు. అలాగే రీసెంట్ గానే జీబ్రా సినిమాలో కూడా మెప్పించిన తాను ఇపుడు ప్రేమ పెళ్లి చేసుకొని ఒక గుడ్ న్యూస్ షేర్ చేసాడు.

 తన ప్రేయసి డాక్టర్ ధన్యతని మైసూరులో గ్రాండ్ గా వివాహం చేసుకున్న పిక్స్ కొన్ని ఇపుడు వైరల్ గా మారాయి. అయితే గత కొంత కాలం నుంచి వీరు ప్రేమలో ఉండగా గత ఏడాది లోనే వీరి వివాహం నిశ్చయం అయ్యిందట. 

సో ఫైనల్ గా ఇపుడు తాను ఒక ఇంటి వాడు కావడంతో అభిమానులు సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక లేటెస్ట్ గానే పుష్ప 2 లో కూడా ఈ టాలెంటెడ్ నటుడు ఐకాన్ స్టార్ కి ధీటుగా కనిపించిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories