అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి రూపొందించిన మోస్ట్ అవైటెడ్ సినిమానే “తండేల్”. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరక్కించినప్పటికే దీనిని ఒక అందమైన ప్రేమకథగా తీసుకొస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.
అయితే లవ్ స్టోరీలకు దేవిశ్రీ ప్రసాద్ చేసే డ్యూటీ ఏ లెవెల్లో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే.అలా ఈ చిత్రానికి మొదట సంగీతం కోసం దేవి వద్దని అల్లు అరవింద్ అనుకుంటే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే కరెక్ట్ అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గరుండి ఈ సినిమాని దేవికి అప్పగించారట.
ఇక ఇపుడు సీన్ కట్ చేస్తే థియేటర్స్ లో దేవిశ్రీ ప్రసాద్ తన ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. తన వింటేజ్ మ్యూజిక్ అంటూ థియేటర్స్ లో క్లాప్స్, విజిల్స్ పలు సీన్స్ కి తన సంగీతంతో కొట్టిస్తున్నాడు. అలాగే సినిమాలో సోల్ కి తన సంగీతం మెయిన్ గా తన మార్క్ బిట్ సాంగ్స్ తో మరింత ప్రాణం పోసినట్లు తెలుస్తుంది. ఇలా బన్నీ పెట్టుకున్న నమ్మకానికి ఏమాత్రం తీసిపోకుండా తండేల్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాడని తెలుస్తుంది.