దేవర రెండో సాంగ్‌ ఈ విజువల్స్‌ తో !

పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్‌ టైగర్‌  ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా మాస్‌ యాక్షన్‌ డైరెక్టర్‌  కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “దేవర” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా పై  సాలిడ్ హైప్ నెలకొనగా ఈ సినిమా విడుదల కి ముందు ప్రమోషనల్ కంటెంట్ పట్ల కూడా మంచి హైప్ ఏర్పడింది.

అలా దేవర నుంచి వచ్చిన మొదటి సాంగ్ “ఫియర్ సాంగ్” కి సెన్సేషనల్ రెస్పాన్స్ రాగా నెక్స్ట్ వచ్చే సాంగ్ కోసం మరింత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సాంగ్ మాత్రం మొదటి సాంగ్ లా కాకుండా ఒక మెలోడియస్ డ్యూయెట్ అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ విషయం నిజం అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఈ రానున్న సాంగ్ గత సాంగ్ లా సముద్రం, రక్తం వంటివి ఏమి లేకుండా బ్యూటిఫుల్ విజువల్స్ తో మంచి కలర్ ఫుల్ గా ఉంటుంది అని దేవర చిత్ర బృందం చెబుతుంది. అలాగే ఈ సాంగ్  ‘వర, తంగం’ ఇద్దరిపై ఉంటుంది అని మరో హింట్‌ కూడా చిత్ర బృందం ఇచ్చింది.

దీనితో ఎన్టీఆర్ మరో రోల్ వర అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం బాధ్యతలు చేపట్టారు.

Related Posts

Comments

spot_img

Recent Stories