దేవర ట్రైలర్‌ విడుదల అక్కడేనా!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా,  మాస్ యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” గురించి అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కి ఆల్రెడీ సాలిడ్ రెస్పాన్స్ అయితే క్రియేట్‌ అవుతుంది.

 ఇక ట్రైలర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ ఈ సెప్టెంబర్ 10న విడుదల చేస్తారు అన్నట్టుగా ప్రస్తుతం రూమర్స్ వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు దీనిపై మరో డీటెయిల్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దేవర ట్రైలర్ లాంచ్ కి మేకర్స్ గ్రాండ్ ప్లానింగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనరల్ గా ఆన్లైన్ లో వదిలేయడం కాకుండా ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టి అక్కడ నుంచి ట్రైలర్ విడుదల చేస్తున్నారట.

మొత్తానికి అయితే ట్రైలర్ తో పాటుగా ప్రమోషన్స్ ని ఇక్కడ నుంచే స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు.  అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories