ముగింపు దశకు చేరుకున్న దేవర సినిమా!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమాను మాస్‌ అండ్‌ సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్‌ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తూ తెలుగు తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నాడు.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. దర్శకుడు కొరటాల ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 10 న గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ను విడుదల చేసారు.

”ఫియర్ సాంగ్” గా వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యూట్యూబ్ లో కూడా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. గోవా లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. అక్కడ కొంత టాకీ పార్ట్ తో పాటు, ఒక సాంగ్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందా లేక మరో షెడ్యూల్ వుంటుందా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సాంగ్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories